పాన్ ఇండియా డైరెక్టర్..దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న భారీ మల్టి స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి రోజుకో వార్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు సినిమా విడుదలయ్యాక ఏ స్థాయిలో రికార్డులు బద్దలుకొడుతుందో అనే ఆలోచనల కన్నా అసలు సినిమాలో తారక్ – చరణ్ ల పాత్రలు ఏ విధంగా ఉంటాయి? అనే సందేహమే చర్చనీయాంశంగా మారింది..రామ్ చరణ్ లుక్ ను రివీల్ చేసిన జక్కన.. ఎన్టీఆర్ లుక్ ను మాత్రం చాల సీక్రెట్ గ ఉంచుతున్నాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ గానే ఉంటుందని టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని లేటెస్ట్ గా అందిన అప్డేట్ ప్రకారం ఆయన ఫిట్ నెస్ కు సంబందించి జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దంగల్ సినిమాలో మాదిరిగా అమిర్ ఖాన్ కండలు పెంచినట్లు స్ట్రాంగ్ గా కనిపిస్తాడట తారక్. ఇప్పటికే గడ్డంతో కొంచెం లావుగా కనిపిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో బలశాలిగా చాలా కఠినంగా కనిపిస్తాడని తెలుస్తోంది.. దీనికి తోడు ఎన్టీఆర్ పులితో కూడా ఫైట్ చేసే సీన్ సినిమాలో ఉందట. సాధారణంగా జక్కన్న సినిమాల్లో విలన్స్ చాలా వైలెంట్ గా ఉంటారు. అయితే ఎక్కువ చేడుగా చూపించకుండా ఎన్టీఆర్ పాత్రను అంతకంటే హై లెవెల్లో చూపిస్తారట. అతని పాత్రను డిజైన్ చేసిన తీరు ఎవరు ఊహించని విధంగా ఉంటుందని టాక్. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకే నటించడానికే చాలా కఠినంగా ఉందంట.. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు తారక్ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఎంత పవర్ఫుల్ గ ఉండబోతుందో..లెట్స్ వెయిట్ అండ్ సి..