టాలీవుడ్ లో ఉన్నటువంటి కాంట్రవర్సియల్ ఫ్యామిలీస్ లో మంచు వారి కుటుంబం అధికంగా అయితే ఏదొక ఇష్యూ లో హైలైట్ అవుతూ వస్తుంది. అయితే కొన్ని వారి ఫేమ్ కోసం కూడా ట్రై చేస్తుండగా గత కొన్నాళ్ల కితం అయితే మంచు వారి హీరో మంచు విష్ణు అయితే టాలీవుడ్ లో ఎవరూ ఊహించని విధంగా “మా”(మూవీ ఆర్టిస్ అసోసియేషన్) కి ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అయ్యిన తర్వాత తాను చేసిన రిలీజ్ “జిన్నా” భారీ డిజాస్టర్ అయ్యింది..
పైగా సన్నీ లియోన్ ని కూడా పెట్టి ఆమెకి ఇచ్చిన రెమ్యునరేషన్ ని కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత తాను తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి “ఢీ” కి సీక్వెల్ అంటూ దర్శకుడు శ్రీను వైట్ల తో భారీ సినిమా అయితే అనౌన్స్ చేసాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి తన బాడీ ని కూడా జిమ్ కి వెళ్లి మార్చేశాడు. అయితే అప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి మంచు బడ్జెట్ తో కూడా అనుకున్న..
ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ మా ప్రెసిడెంట్ గారి ఈ సీక్వెల్ అయితే షెడ్డుకెళ్లినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాతో అయితే శ్రీను వైట్ల నుంచి కం బ్యాక్ ఉంటుందేమో అని చాలా మంది ఆశించారు. కానీ ఫైనల్ గా అయితే ఇలా అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన “ఆగడు” డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్ల గ్రాఫ్ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే..!!