సినిమా లో లిప్ లాక్ సీన్స్ అవసరమా, లేదా, అనే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సౌత్ ఇండియన్ మూవీస్ లో లిప్ లాక్ అనగానే మనకు గుర్తు వచ్చే నటుడు కమల్ హాసన్ అయన చిత్రాలలో ఎక్కడో ఒక దగ్గర ఈ లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. ఒక టి.వి. ఛానల్ వారు కమల్ ని మీ సినిమాలలో లిప్ లాక్ సీన్స్ ఎందుకు పెడతారు అని అడిగితే, నా సినిమాలో ముర్డర్లు కూడా ఉంటాయి దాని గురించి ఎవరు అడగరు, లిప్ లాక్ గురించి మాత్రం అందరు అడుగుతుంటారు అని సమాధానం ఇచ్చారు. అంటే అయన ఉద్దేశం లో కధ చెప్పే క్రమం లో అవి ఎంత అవసరమో, ఇవి కూడా అంతే అవసరం అని.
21 వ శతాబ్దంలో కూడా దీని చర్చ జరుగుతుంది కానీ, మూకీ సినిమాల కాలం లోనే భారతీయ వెండి తెర మీద లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. 1921 లో నాటి బెంగాలీ సినిమా “బిలత్ ఫెరత్” లో ధీరేంద్రనాథ్ గంగూలీ, మన్మధ పాల్ ల మధ్య తోలి ముద్దు సీన్ చిత్రీకరించటం జరిగింది. ఆ తరువాత ఒకటి, రెండు సినిమాలలో కనిపించినా 1933 లో వచ్చిన “కర్మ” సినిమాలో నిజ జీవితంలోనూ భార్య, భర్తలు అయిన దేవిక రాణి, హమాంశు రాయ్ ల మధ్య, ముద్దు సీన్ 4 నిమిషాలపాటు సాగింది. భారతీయ వెండితెర మీద ఇదే అత్యంత సుదీర్ఘమయిన లిప్ లాక్ సీన్ గ రికార్డు క్రియేట్ చేసింది.
కాబట్టి, ఇందు మూలముగా, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భారతీయ వెండి తెర ముద్దు వయసు 100 సంవత్సరాలు, భారతీయ సినిమాలలో బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ముద్దు సీన్స్ చాల సర్వ సాధారణం, అయినా దాని గురించి చర్చలు, ఖండనలు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటె సినిమా అనేది జనాన్ని అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం కాబట్టి. అదే మన రావు గోపాల రావు గారిని అడిగి ఉంటె ” ఛస్ ఎప్పుడు, చెసింగ్లు, ఫైటింగ్లు, కష్టాలు, కన్నీళ్లేనా కూసింత కళా పోషణ ఉండొద్దు? దీన్ సిగ తరగా ” అని ఉండే వారేమో.