ఐఎండీబీ ఇండియా మోస్ట్ పాపులర్ సినిమా ‘కల్కి 2898 AD’
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ IMDb(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలు, మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాల జాబితాల విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండీబీకి ఉన్న మిలియన్లకు పైగా నెలవారీ విజిటర్స్ రియల్ పేజ్ వ్యూస్ ఆధారంగా జాబితాని రూపొందించారు. పాపులర్ మూవీస్ జాబితాలో కల్కి 2898 ఏడీ మూవీ తొలి స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. ఇది ప్రాంతీయ సినిమాల మధ్య కొనసాగుతున్న పోటీని హైలైట్ చేస్తుంది బాలీవుడ్‌కి ధీటుగా దేశంలో పరిశ్రమలు.!
అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా జాబిత
ఆ తర్వాతి స్థానాలలో ఫైటర్, హనుమాన్, సైతాన్, లాపతా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా చిత్రాలు ఉన్నాయి..ఇక అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. ‘పుష్ప-2’ సినిమా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘దేవర 1’ చిత్రం రెండో స్థానం దక్కించుకుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘వెల్ కమ్ టూ ది జంగిల్’. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలు వరుసగా 3, 4 స్థానాలలో నిలిచాయి. వెబ్‌సైట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా IMDbకి మిలియన్ల కొద్దీ నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణల ఆధారంగా జాబితా రూపొందించబడింది!