తాను పాకిస్థాన్ సంతతి యువతినంటూ వస్తున్న వార్తల్ని ఫౌజీలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. తాను పాకిస్థానీ సైనికాధికారి కూతురు అన్నది పచ్చి అబద్ధమని ఆమె పేర్కొన్నారు. కావాలనే ట్రోలర్లు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వ్యాప్తి చేసినట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
“నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురినన్నది పచ్చి అబద్ధం. ఆ దేశంతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. ఆన్‌లైన్‌లో ట్రోలర్లు ఆ విషయాన్ని కావాలనే వ్యాప్తి చేశారు. మా తల్లిదండ్రులు లాస్ ఏంజిలిస్‌కు వలస వెళ్లారు. నేను అక్కడే పుట్టాను. అక్కడే చదివాను. స్టడీస్ పూర్తయిన తర్వాత నటిగా, డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. సినిమా నా జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపింది. భారతీయత, భారత సంస్కృతి నా రక్తంలోనే ఉన్నాయి. నేను భారతీయ అమెరికన్‌ని అని గర్వంగా చెబుతాను..!!