in

Ileana recalls her feelings during pregnancy times!

కొత్త హీరోయిన్ల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో బాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో ఇక్కడ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ఆ తర్వాత ప్రేమలో పడటం, ఆ లవ్ ఫెయిల్యూర్ కావడం, వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె గ్రాఫ్ పడిపోయింది. ఈ క్రమంలో తాను గర్భవతినంటూ ఇలియానా ప్రకటించడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఇలియానా భర్త ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇవేమీ పట్టించుకోని ఇలియానా..పండంటి కొడుక్కి జన్మనిచ్చారు. ఆ తర్వాత తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించారు.

తాజాగా ఇలియానా తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన మొదటి అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎంతో భావోద్వేగంతో ఆమె పోస్ట్ పెట్టారు. కరెక్ట్ గా ఏడాది క్రితం ఇదే రోజున తన చిన్నారి తన లోపల చిన్న పరిణామంలో పెరగడం ప్రారంభించాడని ఆమె చెప్పారు. ఆ సమయంలో తన భావాలు, భావోద్వేగాలు, నరాలు చిన్నారిని బాగా చూసుకోవాలనే విషయాన్ని గుర్తించడం తనకు ఇంకా గుర్తుందని తెలిపారు. ఏడాది తర్వాత తన చేతుల్లో తన కొడుకు నిద్రపోతుండటం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు..!!

Rashmika comments On Vijay Devarakonda’s mother goes viral!

biggest flop for young beauty sreeleela!