పుష్ప సినిమా వరకు అల్లు అర్జున్ జర్నీ ఒక తీరు పుష్ప తరవాత వేరు అన్నట్టు మారింది సీన్. ఇక పుష్ప 2 తో ఇంటర్నేషనల్ ఫైర్ అయిపోయాడు. హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు బన్నీ. నేషనల్ వైడ్ గా బన్నీతో వర్క్ చేసేందుకు మేకర్స్ లైన్ లో ఉన్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ సినిమాలపై వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ బన్నీ త్రివిక్రమ్ తో ఒక సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే..
అదొక్కటేనా బన్నీ మిగతా ప్రాజెక్ట్స్ పై కూడా చర్చలు జరుగు తున్నాయి. ఇలాంటి టైం లో కొరటాల శివ, బన్నీని కలవటం ప్రత్యేకతను సంతరించుకుంది. రీసెంట్ గా ‘దేవర’ మూవీతో పాన్ ఇండియా బోణీ కొట్టిన కొరటాల ఇక నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే తీసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకే బన్నీతో చర్చలు జరిపినట్లు టాక్. కొరటాల చేతిలో ప్రస్తుతం దేవర 2 ఉంది. ఈ మూవీ ఫినిష్ చేసాక బన్నీతో వర్క్ చేసేందుకు సిద్ద పడినట్లు తెలుస్తోంది..!!