in

icon star Allu Arjun featured in ‘The Hollywood Reporter India’

ల్లు అర్జున్ ఇప్పడు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. పుష్ప వన్ తో నేషనల్ అవార్డ్ తెచ్చుకున్నాడు. పుష్ప 2 తో వరల్డ్ వైడ్ పాపులారిటీ, స్టార్ డమ్ తెచుకున్నాడు. బన్నీ క్రేజ్ రోజుకి రోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా బన్నీ ఇంకో అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. జనరల్ గా హీరోయిన్స్ ఎక్కువగా మ్యాగజైన్స్ పై కనిపిస్తారు. ఫేమస్ ప్రత్రికల్లో కవర్ పేజ్ పై మెరిసి మరింత  గ్లామర్ పెంచుతారు. కానీ ఇప్పడు బన్నీ ఒక హాలీవుడ్ ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చాడు.

దీంతో మరొకసారి బన్నీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఫాన్స్ అయితే ఈ మూమెంట్ ని చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. హాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ అనే పేరుతో ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారు. దీని ఫస్ట్ కాపీ కవర్ పేజీపై అల్లు అర్జున్ దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఫోటోషూట్ కంప్లీట్ చేసి, సోషల్ మీడియాలో ఓ బీటీఎస్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఇది కేవలం కవర్ పేజీ ఫొటో షూట్ మాత్రమే కాదు బన్నీకి చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఇందులో పేర్కొన్నాడు..!!

Rishab Shetty in and as Chhatrapati Shivaji Maharaj!