in

icon star Allu Arjun awarded as ‘Indian Of The Year’!

పుష్ప త‌ర్వాత బ‌న్నీతో సినిమా చేసేందుకు బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ సినిమాలో అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన బ‌న్నీ సైమా, ఫిలింఫేర్‌తో ప‌ళ‌/ అవార్డుల‌ను ద‌క్కించుకున్నాడు. ఆయా ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో పుష్ప సినిమాకు అత్య‌ధిక అవార్డ్స్ ద‌క్కాయి. తాజాగా మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డును అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డున ద‌క్కించుకున్న తొలి సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా బ‌న్నీ నిలిచాడు.

బుధ‌వారం న్యూఢిల్లీలోకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బ‌న్నీ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ మాట్లాడుతూ న‌టుడిగా ఇర‌వై ఏళ్ల కెరీర్‌లో ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఎన్నో అవార్డుల‌ను అందుకున్నాన‌ని, కానీ నార్త్ ఇండియా నుంచి అవార్డును స్వీక‌రించ‌డం ఇదే మొద‌టిసారి అని తెలిపాడు. ఈ అవార్డు త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత మంచి సినిమా ఏ భాష‌లో విడుద‌లైన అన్ని ఇండ‌స్ట్రీల వారు ఆద‌రిస్తుండం చ‌క్క‌టి ప‌రిణామ‌మ‌ని అల్లు అర్జున్ చెప్పాడు..!!

Rajinikanth and Mani Ratnam reuniting after 32 years?

jhanvi kapoor all set for another south remake!