
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్ లో ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టిన కాజల్ అగర్వాల్ తమిళ్ స్టార్ హీరో కమల్ హసన్ తో భారతీయడు 2 సినిమాలో నటిస్తుంది. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ ‘ఫిట్ అఫ్ విత్ స్టార్స్’ అనే షోలో పాల్గొంది.అయితే ఇందులో కాజల్ కి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. నీపైన నువ్వు రూమర్ క్రియేట్ చేసుకోవాలంటే ఎం చేస్తావ్ అంటే నాకు కావాల్సిన వరుడు దొరికాడు అని చెబుతాను అంది కాజల్.. ఇక ఇప్పటివరకు పనిచేసిన హీరోలో ఎవరు నిన్ను ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు అనగా రానాతో పని చేయాలంటే చాలా ఫన్నీగా ఉంటుంది. షూటింగ్ టైంలో చాలా ఏడిపిస్తూ ఉంటాడు. కానీ చాలా బాగా చూసుకుంటాడని రానా అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇక అవకాశం వస్తే రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లో ఎవరిని చంపుతావు? ఎవరితో లేచిపోతావు? ఎవరిని పెళ్లి చేసుకొంటావు? అని అడగగా కాజల్ సమాధానం ఇస్తూ.. రాంచరణ్‌ను చంపేస్తా… ఎన్టీఆర్‌తో లేచిపోతా… ఎందుకంటే వారిద్దరూ పెళ్లి అయింది కాబట్టి. ఇక ప్రభాస్‌కు పెళ్లి కాలేదు కాబట్టి ప్రభాస్ ని పెళ్లి చేసుకొంటానని చెప్పుకొచ్చింది కాజల్