in

i never said no for glamor roles : rithu varma

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది .దీంతో సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రీతూవర్మ. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.తను పుట్టి, పెరిగింది హైదరాబాద్ లోనే కానీ.. మూలాలు మాత్రం నార్త్ లో ఉన్నాయని చెబుతోంది. తన ఫ్యామిలీ ఉత్తరాది నుంచి ఇక్కడకి వలస వచ్చిందని తెలిపింది. తను హైదరాబాద్ లో పుట్టి పెరగడం వలన అందరూ పక్కా తెలుగమ్మాయి అనుకుంటారని.. ఇంట్లో అయితే నార్త్, సౌత్ రెండు కల్చర్స్ ఉంటాయని చెప్పింది.

చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూసి పెరిగానని.. తెలుగు సినిమాలు చూసింది తక్కువే అయినా.. తెలుగంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. త్వరలోనే ఓటీటీలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చెప్పింది. అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ ఓకే చేశానని.. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలిపింది. వెబ్ సిరీస్ లో ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుందేమో అని ప్రశ్నిస్తే.. గ్లామర్ రోల్స్ కి తను వ్యతిరేకంగా కాదని.. కానీ ఇప్పటివరకు అలాంటి పాత్రలు రాలేదని చెప్పింది. అలా అని గ్లామర్ కి దూరమని అనుకోవద్దని క్లారిటీ ఇచ్చింది.

shraddha das at an mobile launch event!

Samantha and Naga Chaitanya Heading For A Divorce?