చాలామంది హీరోయిన్స్ భారీ పారితోషకం ఇస్తున్నారంటే ప్రాధాన్యం లేని రోల్స్ చేయడానికి సిద్దమవుతుంటారు. కానీ రాశి ఖన్నా అలా కాదట. పాత్ర నచ్చితే పారితోషకం తక్కువైనా పర్లేదట.. అదే పాత్ర నచ్చకపోతే ఎంతిస్తానన్నా చెయ్యనంటుంది. కరోనా ఎఫెక్ట్ తో ఇంటికే పరిమితమైన రాశి ఖన్నాని పారితోషకం ఎక్కువ ఇస్తానంటే టెంప్ట్ అయి చేసిన సినిమాలేమైనా ఉన్నాయా అని అడిగితే.. నేను అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యను అంటుంది.
ఎందుకంటే రాశి ఖన్నా డబ్బు మనిషి కాదు. కథ నచ్చితేనే సినిమా.. కథ నచ్చలేదంటే పది కోట్లు ఇస్తానన్నా సినిమా చెయ్యను అంటుంది. అదే గనక సినిమా కథ నచ్చితే నిర్మాత పారితోషకం తక్కువ అంటే.. బడ్జెట్ ని బట్టి ఇస్తా అంటే చేస్తానని..నటులకు ఆత్మ సంతృప్తి ముఖ్యం అంతేకాని.. డబ్బు ముఖ్యం ఉండకూడదు అంటుంది. నేనెప్పుడూ డబ్బుకి రెండో ప్రాధాన్యతే ఇస్తాను అంటుంది. మరి కథల ఎంపికలో అంత జాగ్రత్తగా ఉంటే.. మీకు ప్లాప్స్ ఎందుకు గురవుతున్నాయి అని నన్ను మీరు అడగొచ్చు.. కానీ కొన్ని కథలు విన్నప్పుడు బాగానే ఉంటాయి.. అయితే అవి తెర పైన చూసేసరికి మరోలా మారిపోతుంటాయి అని అంటుంది రాశి ఖన్నా.