in

i am not retiring, manchu manoj shuts rumors!

టుడు లేదా నటి కొంతకాలం వెండితెరపై కనిపించకపోతే చాలు.. వాళ్లు సినిమాలు మానేస్తున్నారు అని లేదా.. మరణించారు అని వార్తలు రాసిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. రీసెంట్ గా ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యాడు హీరో మంచు మనోజ్. టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు రెండవ వారసుడిగా 2004 ఆగస్టు 6న ‘దొంగ దొంగది’ మూవీతో టాలీవుడ్ లో డ్యాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. తండ్రికి తగ్గ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, డ్యాన్సింగ్ స్కిల్స్, రిస్కీ ఫైట్స్ చేయటం వంటి పాజిటీవ్ అంశాలు మంచు మనోజ్ లో ఎన్నో ఉంటాయి.

ప్యూర్ కమర్షియల్ సినిమాల కంటే కథ బలమున్న సినిమాలనే ఎంచుకుంటూ కెరీర్ లో ఎన్నో రిస్కీ డెసిషన్ తీసుకున్నాడు. అయితే నటుడిగా ఎప్పటికప్పుడు క్రేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన మంచు మనోజ్ కెరీర్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన హిట్ లేదు. చివరిగా ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలోను తన పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డా మూవీ బాక్సాఫీస్ దెగ్గర ఘోరంగా దెబ్బతింది. ఇక లేటెస్ట్ గా ‘అహమ్ బ్రహ్మస్మి’ అనే సినిమాలో నటిస్తున్నా అది ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి.

megha akash captivating stills!

Forensic report confirms Sanjjanaa Galrani, Ragini Dwivedi took drugs!