హైదరబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా చాలా మంది యూట్యూబర్లు, నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వీరిలో..విష్ణు ప్రియ, సుప్రీత, రీతూ చౌదరీ, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ , కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, బండారు పేషయానీ తదితరులపై పంజాగుట్ట పొలీసులు కేసుల్ని నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులపై సీరియస్ గా చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తు వస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారికి మాత్రం చుక్కలు చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.