డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువతులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే, వారికి సరైన జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జీతం అడిగినందుకు తమను చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఉన్నపళంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళనకు దిగారు..
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులలో ఒకరైన పనిమనిషి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జీతం ఇవ్వకపోగా, కుక్క అరిచిందన్న చిన్న కారణంతో తనపై దాడి చేయబోయారని, నగ్నంగా చేసి ఆ దృశ్యాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త లాయర్ అంటూ డింపుల్ తమను బెదిరించినట్లు కూడా బాధితురాలు పేర్కొన్నారు..!!