
విక్టరీ వెంకటేష్ గారు నటించిన సినిమాల్లో ఎప్పటికి మర్చిపోలేని చిత్రం ‘ప్రేమించుకుందాం రా’, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ను కూడా షేక్ చేసింది. వెంకటేష్ – అంజలా జోడి ఈ సినిమాకు హైలైట్ గ నిలిచింది..సినిమాలో వీరి మధ్య ఉన్న లవ్ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. అయితే, జయంత్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ముందుగా హీరోయిన్ పాత్రకు ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయి ను అనుకున్నారట. జయంత్ ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ కు చెప్పగా..వారు ఐశ్వర్య ను వద్దని చెప్పారట. కారణం, అప్పటికే ఐశ్వర్య చేసిన సినిమాలు వరసగా ప్లాప్ అవ్వడంతో, లక్కీ హీరోయిన్ కాదు..ప్లాప్ హీరోయిన్ తను, అని చిత్ర యూనిట్ జయంత్ గారికి చెప్పడంతో ఇంక చేసేదేమి లేక ఐశ్వర్య ను పక్కన పెట్టేసాడు.. ఈ విదంగా ప్రపంచ సుందరితో నటించే మంచి ఛాన్స్ ను తనకు తెలియకుండానే మిస్ అయ్యాడు మన వెంకీ మామ.

