టాలెంటెడ్ యాక్టర్ విక్రమ్, పా రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. విక్రమ్ 61 వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే లాంఛ్ అయింది. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించే అవకాశాలున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ వచ్చింది. కాగా తాజాగా మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజా గాసిప్ ప్రకారం రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకుందట..డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే రష్మిక సినిమా నుంచి పక్కకు తప్పుకుందని, ఈ నేపథ్యంలో మేకర్స్ సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్‌ను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం సంప్రదించినట్టు ఇన్ సైడ్ టాక్.
విక్రమ్ 61లో నటించేందుకు మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా..దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే ఇవాళ్టి నుంచి కడపలో విక్రమ్ 61 షూటింగ్ మొదలుకానుండటం. లేటెస్ట్ టాక్ ప్రకారం దీపావళి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రాబోతుందని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రాబోతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..!!