in

hot sensation Chandrika Ravi to play silk smitha!

సిల్క్ స్మిత చనిపోయి చాలాకాలమైంది. అయినా ఆమెను చాలామంది ఇంతవరకూ మరిచిపోలేదు. అందుకు కారణం ఆమె చేసిన సినిమాలు..పాత్రలు..రెండు దశాబ్దాల పాటు ఆమె చూపించిన ప్రభావం అని చెప్పాలి. ఆమె బయోపిక్ గా గతంలో విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది..అది వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ ను మరోసారి తెరపై ఆవిష్కరించడానికి రంగం సిద్ధమవుతోంది.

‘సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ’ అనేది ఈ సినిమా టైటిల్. ఈ సారి ఆమె పాత్రలో చంద్రికా రవి కనిపించనుంది. ఈ రోజున సిల్క్ స్మిత జయంతి కావడంతో, ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. వచ్చే ఏడాది ఐదు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రికా రవి మోడలింగ్ నుంచి సినిమాల దిశగా వచ్చింది. ఇంతకుముందు తెలుగులో ఆమె ఒక సినిమా చేసినప్పటికీ, ‘వీరసింహా రెడ్డి’ సినిమాలో ‘మా బావ మనోభావాలు’ స్పెషల్ సాంగ్ తో క్రేజ్ తెచ్చుకుంది..!!

rashmika gets no credit for animal success!

arjun reddy fame shalini pandey eyes on tollywood again!