in

hot beauty dimple hayathi on board for balakrishna’s next!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు వింటేనే థియేటర్లలో పూనకాలు వస్తాయి. ఒకవైపు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తూనే, మరోవైపు వెండితెరపై తనదైన శైలిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నారు బాలయ్య. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య మళ్లీ చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార మెయిన్ హీరోయిన్‌గా ఖరారైన సంగతి తెలిసిందే..

బాలయ్య-నయనతార కాంబినేషన్ అంటేనే ఒక సెంటిమెంట్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో గ్లామర్ డోస్ యాడ్ కాబోతోంది. టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌గా డింపుల్ హయాతి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ‘ఖిలాడి’ వంటి సినిమాలతో మెరిసిన ఈ పొడుగుకాళ్ల సుందరి, బాలయ్య సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని టాక్. డింపుల్ ఎంట్రీతో ఈ సినిమాకు మరింత గ్లామర్ అద్దినట్లవుతుందని మేకర్స్ భావిస్తున్నారట..!!

Prabhas playing an important role in Mahakhali!