విజయ నిర్మాణ సంస్థలో ఒకరు, చందమామ మాస పత్రిక సృష్టికర్త అయిన, చక్రపాణి గారు స్వతహాగా మంచి రచయిత. అంతే కాదు ఆయన చాల ప్రాక్టికల్ గ అలుచించే వారు, ఆయన ప్రవర్తన కూడా దానికి తగినట్టే ముక్కు సూటీ గ ఉండేది. చక్రపాణి గారు తన 24 వ ఏట టి.బి. వ్యాధికి గురి అయ్యారు, వైద్యం కోసం మదనపల్లి టి.బి. శానిటోరియం లో చేరిన అయన, తన ప్రక్కన బెడ్ లో ఉన్న బెంగాలీ వ్యక్తి తో పరిచయం పెంచుకొని, అక్కడ ఉన్న మూడు నెలల్లో, బెంగాలీ నేర్చుకొని,
ఆ తరువాత ప్రసిద్ధ బెంగాలీ రచయిత శరశ్చంద్ర ఛటర్జీ నవలలను తెలుగులోకి అనువదించారు. ఆయన ప్రాక్టికల్ మెంటాలిటీ కి ఇది ఒక చక్కటి ఉదాహరణ గ చెప్పవచ్చు. చక్రపాణి గారి అసలు పేరు ఆలూరి వెంకట సుబ్బా రావు, రచయిత గ అయన పెట్టుకున్న పేరు చక్రపాణి. చక్రపాణి గానే ఆయన చిత్ర రంగ ప్రవేశం చేసి, నాగి రెడ్డి గారి సాహచర్యం తో విజయ సంస్థ స్థాపించి ఎన్నో విజయవంతం అయిన చిత్రాలు నిర్మించారు. దశాబ్దాల పాటు నాగి రెడ్డి గారితో స్నేహాన్ని కొనసాగించారు.