చిరంజీవి గారు నటించిన ” హిట్లర్” సినిమా లో లీడ్ రోల్ కి మొదట మోహన్ బాబు గారిని అనుకున్న నిర్మాత. ఎడిటర్ మోహన్ గారు మలయాళం లో మమ్మూటీ గారు నటించిన హిట్లర్ సినిమా నచ్చటం తో ఆ చిత్రం హక్కులు కొని, రచయిత మరుదూరి రాజా గారికి చూపించటం జరింగింది ఆయనకు నచ్చటం తో, మోహన్ బాబు తో చేద్దాము , డైరెక్టర్ గ ఈ.వి.వి. గారిని అడగమని చెప్పారట రాజా గారితో, ఈ.వి.వి. గారితో ఉన్న సాన్నిహిత్యం తో రాజా గారు ఆయనను అడిగారట, అప్పటికే మోహన్ బాబు గారితో రెండు సినిమాలు చేస్తున్న ఈ.వి.వి. గారు సముఖత చూపలేదు. ఆ విషయం తెలుసుకున్న ఎడిటర్ మోహన్ గారు, ముత్యాల సుబ్బయ్య గారిని డైరెక్టర్ గ కంఫర్మ్ చేసుకున్న తరువాత చిరంజీవి గారిని కలవటం,
చిరంజీవి గారు ఒకే చేయటం జరిగి పోయాయి. ఆ టైం లో చిరంజీవి గారికి కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చి, మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన ఫాన్స్, మరియు చిరంజీవి గారు. ఆ చిత్రం లో ఐదుగురు చెల్లెళ్ళ కు అన్నగా నటించబోతున్నారు అని తెలిసిన ఫాన్స్ గగ్గోలు పెట్టారు. అయినా చిరంజీవి గారికి ఆ కథ నచ్చటం తో ఆ సినిమా చేయటం జరిగింది, మనందరికీ తెలుసు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ తరువాత చిరంజీవి గారి కెరీర్ గ్రాఫ్ మళ్ళీ ఎలా రైసింగ్ లోకి వెళ్లిందో. ప్రతి మెతుకు మీద తినే వాడి పేరు రాసి ఉంటుంది అంటారు, అలాగే సినిమా పాత్రలు కూడా ప్రాప్తం ఉన్నవాడికి దక్కుతాయి అనడానికి ఇది మొదటి ఉదాహరణ కాదు, చివరిది అంతకంటే కాదు.