
వైజయంతి మూవీస్ వారి ప్రతిష్టాత్మక చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి గారి చిత్రమాల లో ఒక స్వర్ణ పారిజాతం వంటి చిత్రం. చిరంజీవి గారు శ్రీదేవి కలసి నటించిన చిత్రం.తెలుగు ప్రేక్షకుల హృదయాల లో ఎప్పటికి నిలిచి ఉండే చిత్రం. చక్రవర్తి అనే రచయిత ఇంద్రుడి కుమార్తె తన ఉంగరం పోగొట్టుకొni భూలోకం వచ్చి హీరో ను కలుస్తుంది అంటూ ఒక లైన్ చెపితే దాని ఆధారంగ జంధ్యాల గారు స్టోరీ డెవలప్ చేసారు. అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు ఒక ముఖ్యమైన అసైన్మెంట్ కోసం కొంత మంది వ్యక్తులను చంద్రుడు పైకి పంపిస్తా ఆలా వెళ్లిన వారికీ కోట్లలలో డబ్బు ఇస్తామంటూ ప్రకటన చేస్తారు. డబ్బు అవసరం ఉన్న హీరో ఆ అసైన్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తాడు, చంద్రుడి పైకి విహారానికి వచ్చిన ఇంద్రజ తన ఉంగరం పోగొట్టుకుంటుంది, అది హీరో కి దొరుకుతుంది, దానిని తిరిగి పొందటానికి ఇంద్రజ భూమి మీద కు వస్తుంది ఇది మొదట తయారు చేసుకున్న స్టోరీ. కానీ టెక్నికల్ గ చాలా ఖర్చు తో కూడుకొన్న సబ్జెక్టు,దాని గురించి చర్చింకుంటున్న సందర్భం లో చిరంజీవి గారు మానస సరోవరం ఐడియా ఇచ్చారు , దెబ్బతో చంద్రయానం తప్పి హిమాలయ యాత్ర అయింది.కానీ డైరెక్టర్ గారు హిమాలయాల ను స్టూడియో కె తీసుకొని వచ్చి లిమిటెడ్ బడ్జెట్ లో నే మూవీ పూర్తి చేసారు. ఎక్కడ రిచ్ నెస్ తగ్గకుండా, శ్రీదేవి గారి గ్లామర్, చిరంజీవి గారి యాక్షన్, ఇళయరాజా గారి మ్యూజిక్ మరియు కే.స్. ప్రకాష్ అండ్ విన్సన్ట్ గారి కెమెరా పనితనం తో సినిమా జనరంజకంగ, ప్రేక్షకుల మనసులు దోచేశారు.తెలుగు సినిమా ఉన్నంత కాలం నిలిచి ఉండే చిత్రాలలో ఈ చిత్రం కూడా ఉంటుంది అనటంలో సందేహం లేదు.

