తాజాగా నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు..
మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. పోలీసుల ముందు విచారణకు మినహాయింపు ఇచ్చింది. గొడవ మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం.. అందులో పోలీసులు, మీడియా అతి జోక్యం సరికాదని పేర్కొంది. పోలీసులు మోహన్‌బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది..!!