తమిళ నటుడు సూర్య అప్పుడప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తుంటాడు. ప్రస్తుతం సూర్య తన 40 వ సినిమాను పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను యదార్థ ఘటన ఆధారంగా తీస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల కిందట కేరళలోని పొల్లాచి అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యాచారం చేసిన నేరస్థులను శిక్షించే..
పవర్ ఫుల్ పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు సూర్య చాలా ఎమోషనల్ అయ్యారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని రేకిత్తిస్తోంది. జూలై 23న సూర్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్య ఈ సినిమాతో పాటు హరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.