హీరో కృష్ణ గారి ఖాతాలో పడవలసిన ఒక హిట్ చిత్రం, చిరంజీవి గారి ఖాతాలో పడింది. 1987 లో వచ్చిన ” పసివాడి ప్రాణం” చిరంజీవి కెరీర్లోనే ఒక పెద్ద హిట్. ఈ చిత్రం కృష్ణ గారు నటించవలసింది, విజయ బాపినీడు గారు హాలీవుడ్ చిత్రం ” విట్నెస్” ఆధారంగా ఒక కధ తయారు చేసుకున్నారు, చిత్ర హీరో గ కృష్ణ గారు, హీరోయిన్ గ శ్రీ దేవి, పసివాడి గ మహేష్ బాబు ను అనుకున్నారు, చిత్ర ప్రారంభ సన్నాహాలు మొదలు పెట్టారు. అప్పటికే విట్నెస్ చిత్రం ఆధారంగా మలయాళ దర్శకుడు ఫాజిల్ మమూట్టి హీరో గ, సురేష్ గోపి విలన్ గ 1986 లో” పూవిన్ పుతియా పోన్ తిన్నెల్ ” అనే చిత్రం తీశారు అది మంచి హిట్ అయింది. ఆ తరువాత తమిళం లో సత్యరాజ్ హీరోగా, రఘువరన్ విలన్ గ “పూవిలి వాసలిల్లై ” చిత్రం నిర్మించారు,
చిత్రం 1987 జనవరి లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం హక్కుల కోసం చాల మంది నిర్మాతలు పోటీ పడ్డారు చివరకు అల్లు అరవింద్ ఈ చిత్రం హక్కులు దక్కించుకొని చిరంజీవి హీరో గ, రఘువరన్ విలన్ గ ఈ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఈ విషయం తెలియని విజయ బాపినీడు గారు ఒరిజినల్ చిత్రం విట్నెస్ ఇన్స్పిరేషన్ తో ” సాక్షి” అనే కధ తయారుచేసుకొని కృష్ణ, శ్రీదేవి, మహేష్ బాబు తో ఈ సినిమా నిర్మించాలి అనుకున్నారు. ఇదే కధాంశం తో ఆల్రెడీ రెండు భాషల్లో, రెండు చిత్రాలు వచ్చాయని, ఆ కధ హక్కులు తీసుకున్న అరవింద్ గారు చిరంజీవి తో ఈ చిత్రం నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆ ప్రయత్నం విరమిచుకున్నారు.