
పోసాని నాగ సుధీర్ బాబు, ఈయన ఎవరండీ మన పోసాని గారి తమ్ముడు అనుకుంటున్నారా? కాదండి బాబు, మన మహేష్ బాబు గారి ముద్దుల చిన్న బావ గారు, అదేనండి బాబు ” ప్రేమకథ చిత్రం” సుధీర్ బాబు, అవునండి ఆయన గారి పేరే నేను చెప్పింది. సుధీర్ బాబు నటుడు మాత్రమే కాదు, మంచి బాడ్మింటన్ ప్లేయర్ కూడా, ప్లేయర్ అంటే ఏదో స్ట్రీట్ ప్లేయర్ కాదు, స్టేట్ ప్లేయర్, బెంగళూరు లో చదువుకుంటున్నప్పుడు, హీరోయిన్ దీపికా పదుకొనె, నాన్న గారు అయినా ప్రకాష్ పదుకొనె బాడ్మింటన్ అకాడమీ లో, పుల్లెల గోపీచంద్ గారి కోచింగ్ లో మంచి ప్లేయర్ గ ఎన్నో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ టౌర్నమెంట్స్ ఆడిన అనుభవం ఉన్నది. పుల్లెల గోపీచంద్ గారికి వీరాభిమాని, అటువంటి తన రోల్ మోడల్ గోపీచంద్ గ తేరా మీద నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆయనకు ఉన్న బాడ్మింటన్ అనుభవం, గోపీచంద్ గారితో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ఈ అవకాశం వచ్చేందుకు దోహదం చేసింది. బయోపిక్ లలో నటించి మెప్పించటం అంత సులభం కాదు, అదీకాక ఒక ప్లేయర్ గ నటించాలి అంటే ఆ ఆటలో బేసిక్స్ తెలిసి ఉండటం చాల ముఖ్యం, ఆ విధం గ సుధీర్ బాబు కు ఇది మంచి అవకాశం, తన ఆటను మరియు నటనను చూపించటానికి. నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, తన బాడ్మింటన్ నైపుణ్యం తో తెలుగు ఆడియన్స్ నే కాక హిందీ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తారని ఆశిద్దాం, హిందీ వెర్షన్ లో కూడా సుధీర్ బాబే నటిస్తున్నారు.

