ఈబ్యూటీ కోసం ఆషామాషీ పాత్రలు కాకుండా దర్శకులు కూడా మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటేనే ఆమెను సంప్రదిస్తూ ఉంటారు. ఇక సాయి పల్లవి తన సినిమా కెరియర్ లో ఎప్పుడు కూడా రెగ్యులర్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. అందులో మాస్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా ఎంతో కొంత కొత్తగా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా టెంప్ట్ అయినా సందర్భాలు లేవు.
భోళా శాఖ లాంటి సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో సిస్టర్ పాత్రకు ఆమెను అడిగినప్పుడు రీమేక్ సినిమాలు తన జీవితంలో చేయను అని ఓపెన్ గానే చెప్పేసింది. అయితే గత ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలు చేసిన సాయి పల్లవి మళ్లీ మరో సినిమా చేసింది లేదు. అయితే ఆమెకు అవకాశాలు రావడం లేదా అనే సందేహాలు వస్తున్నాయి. కానీ నిజానికి సాయి పల్లవికి అవకాశాలు రాక కాదు. చాలా రకాల కథలు వింటున్నప్పటికీ ఏవి ఆమెకు సంతృప్తిగా అనిపించడం లేదట. వస్తే మళ్లీ మంచి కంటెంట్ ఉన్న సినిమాతోనే రావాలి అని సాయి పల్లవి ఎదురుచూస్తోంది.