in

Harish Shankar to direct balayya soon?

నెక్స్ట్ హరీష్ నందమూరి నటసింహం బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీని క‌ర్నాట‌క‌కు చెందిన ఒక ప్రముఖ బ్యానర్ నిర్మిస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు హరీష్ పుట్టిన రోజుకి విషెస్ చెప్తూ  కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో “హ్యాపీ బ‌ర్త్ డే టూ అవ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రిశ్ శంక‌ర్” అంటూ కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్  ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.  దీంతో ఈ పోస్ట్ ఇప్పడు వైరల్ గా మారింది. బాలయ్య , హరీష్ సినిమా నిజమే అని, కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.

వీటికి సంబధించిన వర్క్ కూడా మొదలయ్యింది అని అందుకే  కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ హ‌రిశ్ శంక‌ర్ కి ప్ర‌త్యేకంగా బ‌ర్త్ డే విషెస్ చెప్పారని టాక్ . ఈ న్యూస్ విన్న నందమూరి  ఫాన్స్  ఫుల్ ఖుషిగా ఉన్నారు.  ‘గ‌బ్బ‌ర్ సింగ్’ లాంటి ప‌వ‌ర్ ఫుల్  క్యారక్టర్ తో పవన్ కి మంచి హిట్ ఇచ్చిన హరీష్ బాలయ్యకి కూడా అలాంటి సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు..!!

Family Star!

Vijay’s whopping remuneration for Thalapathy 69?