in

Harish Shankar and Balakrishna film on Cards!

బాలకృష్ణ ఇటీవల ‘డాకు మహారాజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా పూర్తికాక ముందే బాలయ్య నెక్స్ట్ మూవీపై సినీ సర్కిల్స్‌లో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ త్వరలోనే దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొంత కాలంగా వినిపిస్తోంది..

అయితే, ఇప్పుడు ఈ వార్త దాదాపు కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ చెప్పిన ఓ స్టోరీలైన్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని..ఇప్పుడు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ప్రముఖ బ్యానర్ కూడా ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ బాలయ్య-హరీష్ శంకర్ కాంబినేషన్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట..!!

 

Laila Overall review!

regina cassandra opens up on unfair casting due to language!