టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి సుకుమార్ కూడా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా సరికొత్త క్రేజ్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..
తెలుగు సినీ పరిశ్రమలో తన సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్. ఆయన సినిమాలు అర్థం కావాలంటే మినిమం ఇంటెలిజెన్సీ ఉండాలి…ఎంటర్ టైన్ మెంట్ కి ఎగ్జైట్ మెంట్ యాడ్ చేసి పజిల్ లాంటి స్క్రీన్ ప్లే తో లాజికల్ గా సినిమాలు తీసే సుకుమార్ బర్త్ డే ఈ రోజు. 11 జనవరి 1970 లో తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన సుకుమార్ కాకినాడ లో కొన్ని రోజులు మాథ్స్, ఫిజిక్స్ లెక్చరర్ గా చేశారు.
ఆ తరవాత డైరెక్టర్స్ మోహన్, వివి.వినాయక్ సినిమాలకు కథల్ని అందించిన సుకుమార్ ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఫస్ట్ సినిమాకే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు గెలుచుకున్నాడు. బన్నీతో ఆర్య, ఆర్య-2, పుష్ప, నాగచైతన్యతో ‘హండ్రెడ్ పర్సెంట్ లవ్’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’ మహేష్ తో ‘వన్’, చరణ్ తో ‘రంగస్థలం’ సినిమాలు తీశాడు సుకుమార్. ఇండస్ట్రీతో పాటు అభిమానులు ముద్దుగా సుక్కూ అని పిలుచుకునే ఈ విలక్షణ దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది..మా తెలుగు స్వాగ టీం..!!