శ్రీనివాస రెడ్డి ప్రముఖ తెలుగు సినీ నటుడు/ దర్శకుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు..పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు.
ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు. ఇడియట్, వెంకీ, దేశముదురు, ఆంజనేయులు, బ్లేడు బాజ్జీ, కత్తికాంతరావు, డార్లింగ్, సోలో, నమో వెంకశ, రాజా ది గ్రేట్, జంబ లకిడి పంబ వంటి మొదలగు సినిమాల్లో మంచి పేరు సంపాధించారు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ‘భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు’ అనే సినిమాను తీసాడు..శ్రీనివాస రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికీ బెస్ట్ విషెస్ తెలియ చేస్తున్నాము..