ప్రస్తుతం పూజా హెగ్డే..పేరుకు ఎంత క్రేజ్ వుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్టోబర్ 13న ఈమె పుట్టినరోజు. అయితే పూజా హెగ్డే..నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ..ఇక ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. అయితే ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే ఈ ఏడాది బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలతో సందడి చేసింది.ఈమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. అయితే పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది.