in

happy birthday naveen polishetty!

తెలుగు సినీమా రంగంలో ఇప్పుడు కంటెంట్ రాజ్యం ఏలుతోంది. యువ ర‌క్తం ఉరుక‌లు వేస్తోంది. ఇవాళ అలాంటి యువ న‌టుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ స్వంతం చేసుకున్న న‌టుడు న‌వీన్ పోలివెట్టి. అటు హిందీ, ఇటు తెలుగు సినిమా రంగాల్లో న‌టిస్తున్నాడు. ప‌లు యూట్యూబ్ వీడియోల‌తో పాటు షార్ట్ ఫిలింల‌లో న‌టించాడు. న‌వీన్ పోలిశెట్టి తెలుగులో ఏజెంట్ శ్రీ‌నివాస ఆత్రేయ లో న‌టించాడు. ఈ మూవీ 2019లో వ‌చ్చింది. బిగ్ స‌క్సెస్ అందుకుంది. అదే ఏడాది హిందీలో వ‌చ్చిన చిచోర్ లో న‌టించాడు.

ఆ మూవీలో కీల‌క పాత్ర పోషించాడు న‌వీన్ పోలిశెట్టి. ఇక మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ భూపాల్ లో ఇంజ‌నీరింగ్ చేశాడు. ఆ త‌ర్వాత సివిల్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేశాడు. నాట‌కాల ద్వారా న‌టుడ‌య్యాడు. యూట్యూబ్ వీడియోల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టాడు. అతి కొద్దికాలంలోనే యూట్యూబ్ స్టార్ గా వెలుగొందాడు. బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపిన ఏజెంజ్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ తో న‌వీన్ పోలిశెట్టికి అద్భుత‌మైన గుర్తింపు వ‌చ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ , శ్ర‌ద్దా కపూర్ ల‌తో క‌లిసి బాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్నాడు న‌వీన్ పోలిశెట్టి.

2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో న‌టించాడు. 2013లో డి ఫ‌ర్ దోపిడీ హ‌రీష్ , 2014లో నేనొక్క‌డినేలో న‌టించాడు న‌వీన్. హిందీ ఆసిడ్ లో కూడా న‌టించాడు. ఇక 2020 న‌వీన్ పోలిశెట్టికి అద్భుత‌మైన ఇయ‌ర్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే క‌రోనా క‌ష్ట కాలంలో సైతం అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జాతి ర‌త్నాలు మూవీ బ‌డా హీరోల సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా స‌క్సెస్ సాధించింది..ఈ యంగ్ హీరో ఇలాంటి హిట్స్ ఎన్నో సాధించాలని మనసారా కోరుకుంటూ..హ్యాపీ బర్త్ డే జాతి రత్నం నవీన్…!!

Rashmika was not comfortable doing the sizzling song ‘Peelings’!

mohan lal Wants To Direct Chiranjeevi!