నాని ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలని. కానీ.. ఇతనిలో హీరో మెటీరియల్ దర్శకులను ఆకర్షించింది. అష్టాచెమ్మాతో హీరో అయ్యాడు. ఈ సినిమా అంతా సిటీ, పల్లెటూళ్ల మధ్య జరుగుతుంది. ఇక్కడే నాని సక్సెస్ అయ్యాడు. పల్లెటూళ్లో పక్కింటి అబ్బాయిగా.. సిటీకి వస్తే స్టయిల్ గా కనిపించి తనలోని హీరోను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నాని నటన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ.. ఇలా ప్రతి సినిమాలో తనదైన నటనతో మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. క్లాస్ సినిమాలకు నానీ పర్ఫెక్ట్ అని పరిశ్రమ, మినిమం గ్యారంటీ అని ట్రేడ్ ఓ అంచనాకు వచ్చేలా ఎదిగాడు. ప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీలో ఇది సామాన్యమైన విషయం కాదు. కామెడీ, అమాయకత్వం, సీరియస్, సహజ నటన..
ఏదైనా ఇప్పుడు నానీ ఓ బ్రాండ్..అందరిలానే నానీకి హిట్స్ ఉన్నాయి.. ఫ్లాప్స్ ఉన్నాయి. కానీ.. నానీ కెరీర్లో ఓ అద్భుతం అంటే చెప్పాల్సింది జెర్సీ. ఈ సినిమాలో నానీ క్రికెటర్ పాత్రలో నటించాడు అనేకంటే జీవించాడు అని చెప్పాలి. నానీ నటనకు గీటురాయిగా నిలిచింది. శ్యామ్ సింగరాయ్ లో కూడా నానీ కాకుండా పాత్రే కనిపిస్తుంది. తీవ్రమైన పోటీ మధ్య నానీ వేసుకున్న దారి అద్వితీయం. తనకోసం రచయితలు కథలు సిద్ధం చేసే రేంజ్ కి ఎదగడం ఓ హీరో సాధించిన ఘనత. నాని దీనిని సాధించాడు. అందుకే నాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు తీయని పాయసం. మంచి సినిమాలు ఇచ్చే హీరో. ఇప్పుడు ఊరమాస్ పాత్రలో కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం దసరా సినిమాలో చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా నానీ కెరీర్ ఘనంగా ఉండాలని.. మరిన్ని సక్సెస్ లు సాధించాలని బర్త్ డే విశెష్ చెప్తున్నాము..!!