90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ భామ నగ్మా అప్పట్లో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో నెం.1 హీరోయిన్‌గా చక్రం తప్పింది. అప్పట్లో సౌతిండియా టాప్ హీరోలందరితోనూ జత కట్టింది. బాలీవుడ్లో పరిశ్రమకూ తన గ్లామర్ రుచి చూపెట్టింది. ఈ రోజు నగ్న 50వ పుట్టినరోజు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
తెలుగులో నగ్మ నటించిన ప్రేమికుడు, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, భాషా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి. వయసు పైబడటంతో హరోయిన్ పాత్రల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేయడానికి సిద్ధమైన నగ్మ చివరి సారిగా తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో కనిపించింది.నగ్మ .2007 తర్వాత ఆమె ఏ బాషలోనూ సినిమాలు చేయలేదు.
తెలుగులో నగ్మ పెద్దింటి అల్లుడు, కిల్లర్, ఘరానా మొగుడు, అశ్వమేధం, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సూర్య పుత్రులు, మౌనం, అల్లరి రాముడు, కొండపల్లి రాజా, ముగ్గురు మొనగాళ్లు, రాజసింహం, రెండిళ్ల పూజారి, సరదా బుల్లోడు, సూపర్ పోలీస్, వారసుడు, గ్యాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించింది. నగ్మ అసలు పేరు నందితా మోరార్జీ. అయితే ఆమె స్క్రీన్ నేమ్ మాత్రం నగ్మ. ఆ పేరుతోనే ఆమె పాపులర్ అయింది. ఆమె పేరులోని సెక్సీ తనం కూడా చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసింది..!!