ప్రతి ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటున్నారు..తొలి చిత్రం ‘ఉప్పెన’ తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి మాలివుడ్ కి హాయ్ చెబుతున్నారు. టోవిలో థామస్ హీరోగా మలయాళం లో ‘అజయాంటే రంధం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతి శెట్టి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కూడా కథానాయకలుగా కనిపిస్తారు. కాగా ఈ భామ నటించిన దివారియర్, మాచర్ల నియోజకవర్గం ఇటీవలే విడుదలై పెద్దగా ఆకట్టుకోలేక పోయిన సంగతి తెలిసిందే.