in

Hanuman created a record on Book My Show!

నుమాన్ ఒక్కదానికి అమ్ముడు అవుతున్న టికెట్లు.. మిగతా మూడు సంక్రాంతి సినిమాల సేల్స్ కంటే ఎక్కువ ఉండడం విశేషం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు 24 గంటల వ్యవధిలో హనుమాన్ కు బుక్ మై షో లో 3.96 లక్షల టికెట్లు అమ్ముడైతే..మహేష్ బాబు మూవీ గుంటూరు కారం టికెట్లు లక్షన్నర సేల్ అయ్యాయి. నాగార్జున సినిమా నా సామి రంగకు 96 వేల టిక్కెట్లు..

వెంకటేష్ మూవీ సైంధవ్ కు 47 వేల చొప్పున టిక్కెట్లు తెగాయి. బడ్జెట్, బిజినెస్, స్టార్ కాస్ట్ పరంగా హనుమాన్ కంటే పెద్ద సినిమాలు అయిన గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్ మూడు కలిపినా కూడా టికెట్ల అమ్మకాలు మూడు లక్షలు లోపే ఉన్నాయి. కానీ హనుమాన్ 24 గంటల వ్యవధిలో వీటి కంటే లక్ష టికెట్లు ఎక్కువే సేల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హనుమాన్ ప్రభంజనానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు..!!

Sai Pallavi’s Sister Pooja reveals her Life Partner!

Rakul Preet opens up about relationship with Jackky Bhagnani!