గురువు కు గురుదక్షిణ చెల్లించిన సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ గారిని హీరో గ పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బా రావు గారు, హిందీ సినిమాలలో నష్ట పోయి ఆర్ధికం గ నిలదొక్కుకోవడానికి మళ్ళి ఒక తెలుగు సినిమా చేయాలి అనుకొన్నారు, మిత్రుల సలహా మీద కృష్ణ గారిని కలిశారు, కధ ఏమిటి అని అడగకుండానే డేట్స్ ఇచ్చేసారు కృష్ణ, అప్పటికి కృష్ణ గారు సూపర్ స్టార్ ఇమేజ్ తో తెలుగు పరిశ్రమలో తిరుగులేని హీరో గ ఎదిగారు. ఆదుర్తి గారు కృష్ణ గారితో ” మాయదారి మల్లిగాడు” అనే సినిమా బ్లాక్ అండ్ వైట్ లో తీయాలని అనుకున్నారు, తన మొదటి సినిమా ” తేనే మనసులు” చిత్రాన్ని కలర్ నిర్మించిన ఆదుర్తి గారు, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో సినిమా చేయాలి అనోకోవటం వెనుక ఆయన ఆర్ధిక పరిస్థితి ని అర్ధం చేసుకున్న కృష్ణ గారు గురువు గారు, కలర్ ఫిలిం నేను ఏర్పాటు చేస్తాను మనం కలర్ లోనే సినిమా చేద్దాము అని నచ్చ చెప్పి. తన పరపతి తో కలర్ ఫిలిం ఏర్పాటు చేసారు, అప్పట్లో కలర్ ఫిలిం దొరకటం చాల కష్టం గ ఉండేది.
షూటింగ్ మొదలయ్యాక తమిళనాడు లోని ఒక పల్లె లో షూటింగ్ జరిగినన్ని రోజులు కృష్ణ గారు తన సొంత ఖర్చులతో, తన కారులోనే షూటింగ్ కి వెళ్ళటమే కాకుండా, ఆదుర్తి గారికి తెలియకుండా రెండు లక్షల రూపాయలు వారి తమ్ముడికి ఇచ్చి ఇది ఉంచండి మళ్ళి చూసుకుందాం అంటూ షూటింగ్ నిరన్తరాయం గ జరిగేట్లు చేసారు.ఒక్క రూపాయ కూడా తీసుకోకుండా సినిమా పూర్తి చేసారు, సినిమా పూర్తి అయ్యాక కృష్ణ గారికి గుంటూరు ఏరియా హక్కులు ఇచ్చారు ఆదుర్తి గారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది ఆదుర్తి గారి ఆర్ధిక కష్టాలు గట్టెక్కాయి, షూటింగ్ జరిగినన్ని రోజులు కృష్ణ గారు ఆదుర్తి గారి ముందు కూర్చోకుండా షూటింగ్ చేసారు. అది అయన కు ఆదుర్తి గారి మీద ఉన్న గురుభక్తి కి నిదర్శనం. అందుకే కృష్ణ గారు సూపర్ స్టార్ అయ్యారు.