
నూనూగు మీసాల కుర్రవాడు, చదువు తప్ప మరో ప్రపంచం తెలియదు, అటువంటి కుర్రవాడిని కాలేజ్ ఫంక్షన్ లో వేయబోయే నాటకం లో,ఆడ వేషం వేయమన్నారు గురువు గారు, గురువు ఎవరో కాదు సాక్షాత్తు,విఖ్యాత కవి ,విశ్వనాథ సత్యనారాయణ గారు, ఈ కుర్రాడికి నాటక అనుభవం లేదు, నటన మీద పెద్ద ఆసక్తి లేదు, అయినా గురువుగారి మాట కాదనలేక ఒప్పుకున్నా, మీసాలు తీయటానికి ఒప్పుకోలేదు, మేకప్ లోనే తన నూనూగు మీసాలు కవర్ చేసి ఆ వేషం వేసి మమ అనిపించారు ఆ తరువాత అదే కుర్రాడు కాలక్రమం లో సినీ రంగ ప్రవేశం చేసి, 350 చిత్రాలు నటించి, రాముడిగా, కృష్ణుడిగా తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం అయ్యారు, రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆరు కోట్ల తెలుగువారికి అన్న అయ్యారు, ఆయనే నందమూరి తారక రామ రావు గారు.

