గుండమ్మ కథ” చిత్రం లో అక్కినేని, జమున గారి మీద చిత్రీకరించిన “ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము ఎలానో” అనే పాట ఎలా పుట్టిందో తెలుసా ? గుండమ్మ కథ నిర్మాణ సమయంలో గీత రచయిత పింగళి గారు తరువాతి పాట ఎక్కడ చిత్రీకరిస్తున్నారు అని చక్రపాణి గారిని అడిగారట, లొకేషన్ తెలుసుకుంటే పాట వ్రాయటం సులువు అవుతుంది కదా అని, దానికి చక్రపాణి గారు పింగళి గారు! పాటలో దమ్ముండాలి గాని ఊటీ, కొడైకెనాల్ అవసరమా పాటలు తీయడానికి అన్నారట.
చక్రపాణి గారి మాటలు విన్న పింగళి గారికి నిజమే అనిపించింది. ఆ చిత్రంలోని సన్నివేశాన్ని బట్టి ” ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఎలానో ” అని పాట వ్రాసారు ఆ పాట అందరికి నచ్చటం, చక్రపాణి గారు చమత్కరించినట్లు, పింగళి గారు వ్రాసినట్లు గానే ఊటీ, కొడైకనాల్ వెళ్లకుండా, స్టూడియో లోని విజయ గార్డెన్స్ లోనే ఆ పాటను చిత్రీకరించటం జరిగింది, గుండమ్మ కథ సినిమాలో ఆ పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే.