
సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. నటశేఖర కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్ బాబు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మూడో తరం వారసురాలు వెండితెర అరంగేట్రానికి సిద్ధమయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ఆయన కుమార్తె మంజుల-సంజయ్ స్వరూప్ దంపతుల కుమార్తె జాన్వి స్వరూప్ ఘట్టమనేని హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త వెలువడింది..
మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి స్వరూప్, త్వరలోనే ఓ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో నటి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదల చేసిన ఆమె ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌తో ఉన్న ఫొటోలో జాన్వి లుక్ ఫ్రెష్‌గా, ఆకట్టుకునేలా ఉంది..!!
 
					 
					
