in

gopichand’s heroine kavya thapar slips her tongue!

కావ్య థాపర్ “ఏక్ మినీ కథ” సినిమాతో కరోనా టైంలో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ “ఈగల్” సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతోంది కావ్య. గోపీచంద్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అయితే శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు “విశ్వం” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని గత కొంతకాలంగా వార్త వైరల్ అవుతుంది.

తాజాగా కావ్య ఇదే విషయాన్ని బయట పెట్టింది. తను గోపీచంద్ “విశ్వం” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నానని చెప్పడంతో ఆమె స్వయంగా టైటిల్ ను లీక్ చేసినట్టుగా అయ్యింది. ఇప్పటిదాకా చిత్ర బృందం టైటిల్ వార్తలపై స్పందించలేదు, అలాగని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బహుశా ఏదైనా ప్రత్యేక సందర్భం చూసుకుని అనౌన్స్ చేస్తే బాగుంటుందని అనుకున్నారేమో. కానీ ఈ బ్యూటీ నోరు జారి టైటిల్ ను ఇలా రివీల్ చేసి “Gopichand 32” మేకర్స్ కు గట్టి షాక్ ఇచ్చింది..!!

WHAT A PATHETIC END!

Ram Charan to team up with Bollywood’s cult director?