కథానాయిక ఇలియానా సినీరంగంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలెన్నో ఉంటాయని, ఇక్కడ కష్టానికి తగిన ప్రతిఫలం ఏ మాత్రం లభించదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలియానా మాట్లాడుతూ ‘సినీరంగంలో జాలి అనే మాటకు ఏ మాత్రం చోటుండదు. పరిశ్రమలో మనుగడ సాగించడం అనుకున్నంత సులభంకాదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే తారలకు తగినంత గౌరవం ఉంటుంది.
ఒక్కసారి ఇమేజ్ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. నా స్వీయానుభవంలో ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది. ఇక్కడ మన అభిరుచులు, అభిప్రాయాలతో సంబంధం లేకుండానే ఎన్నో విషయాలు జరిగిపోతుంటాయి. వాటన్నింటిని చూస్తూ మౌనంగా ఉండాల్సిందే. కష్టపడేతత్వం కంటే పరపతి ఉన్నవాళ్లు, సిఫార్సులు చేయించుకునే విద్య తెలిసిన వాళ్లే సినీ పరిశ్రమలో రాణిస్తారు’ అని తెలిపింది..