సుబ్రమణ్య శ్రీనివాసన్, సినీ నామధేయం ఎస్.ఎస్.వాసన్, జెమినీ స్టూడియోస్ అధినేత, చాల ముందు చూపు కల వ్యక్తి, దానికి చక్కటి ఉదాహరణ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న, అమెజాన్, ఫ్లిఫ్కార్ట్, లాగా 1925 లోనే పోస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేసి, ఎవరికి ఏ వస్తువు కావాలన్నా, పోస్ట్ ద్వారా సప్లై చేసే వారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్ లాగా, పోస్టల్ మార్కెటింగ్ అన్న మాట. అసలు సినీ పరిశ్రమకు ఏమి సమబంధం లేని వాసన్ గారు జెమినీ స్టూడియో స్తాపించటానికి వెనుక కూడా ఒక ఆసక్తికరమయిన కధ ఉంది. ” ఆనంద వికటన్ ” అని పత్రిక స్థాపించిన వాసన్ గారికి కొంత మంది సినీ పరిశ్రమకు సంబంధించిన వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. 1941 లో అగ్ని ప్రమాదానికి గురి అయి నష్టాలలో ఉన్న” “మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ కంబైన్స్” అనే స్టూడియో వేలానికి వచ్చింది,
ఆ స్టూడియో ను వాసన్ గారు 86 ,425 రూపాయలకు కొన్నారు. వాసన్ గారు ఆ స్టూడియో కి “జెమినీ స్టూడియో” అని నామకరణం చేసారు. అప్పట్లో వాసన్ గారు చాల తరచు గ గుర్రపు పందాలకు వెళుతుండే వారట, అయన తన ఫేవరెట్ గుర్రం ” జెమినీ స్టార్ ” అనే గుర్రం మీద పందెం కాసే వారట, ప్రతి సారి ఆయనకు విజయమే, భారీ మొత్తం లో డబ్బులు గెలిచే వారట. ఆలా గెలిచిన డబ్బుతోనే స్టూడియో కొన్నారని,అందుకే తన లక్కీ హార్స్ పేరును స్టూడియో కి పెట్టారు అని ఒక కధనం. కానీ వాసన్ గారు “మిధున రాశి” కి చెందిన వారు కావటం తో తన స్టూడియో కి జెమినీ అని పేరు పెట్టారు అంటారు మరి కొందరు. విజయ వంతమయిన చిత్రాలకు మారు పేరు గ మారారు, ఎంతగా అంటే శ్రీ శ్రీ వంటి మహా కవి, ” సినిమా బాగా నడిస్తే వాసన్, లేకుంటే ఉపవాసన్ ” అని నిర్మాతల గురించి చమత్కరించేటంత.