
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]వ[/qodef_dropcaps]రుణ్ తేజ్ నటించిన వాల్మీకి చివరి నిమిషంలో పేరు మార్చుకుని గద్దలకొండ గణేష్‌గా థియేటర్స్‌లోకి వచ్చింది. అయినా కూడా ఆ సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ ప్రేక్షకులకు బాగానే నచ్చింది. దీంతో మొదటి రోజే 5.5 కోట్ల భారీ డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టిన గద్దలకొండ గణేష్ శని,ఆదివారాల్లో కూడా బాగానే సంపాదించాడు. దాంతో ఈ సినిమా మొదటి మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 15.19 కోట్లు కొల్లగొట్టింది. అక్టోబర్ 2nd మెగా స్టార్ సై రా చిత్రం రిలీజ్ అయ్యే వరకు మరో చెప్పుకో దగిన సినిమా రిలీజ్ లేకపోవడంతో గద్దలకొండ గణేష్ కొనుకున్నవాళ్లందరికి కూడా మంచి లాభాలే అందించే అవకాశం ఉంది.