in

frustrated rakul preet skips topic about her boy friend!

చిత్ర‌సీమలో మ‌రో ప్రేమ క‌థ న‌డుస్తోంది. అదే.. ర‌కుల్ – జాకీ భ‌గ్నానీల జోడీ. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని మీడియా చిల‌వ‌లు, ప‌ల‌వ‌లుగా రాయ‌కముందే ర‌కుల్ బ‌య‌ట‌పెట్టేసింది. మేమిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నాం.. అని చెప్పేసింది. అప్ప‌టి నుంచీ ర‌కుల్ ఎప్పుడు, ఎక్క‌డ, ఏ ఇంట‌ర్వ్యూలో క‌నిపించినా… `జాకీ`కి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎక్కువ అవుతున్నాయి. వీటికి స‌మాధానం చెప్పీ, చెప్పీ ర‌కుల్ కూడా విసిగిపోయి ఉంటుంది. అందుకే ఓ ఇంట‌ర్వ్యూలో `మా ప్రేమ క‌థ గురించి అడ‌గొద్దు ప్లీజ్‌` అనేసింది..ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది.

అమ్మ, నాన్న, తమ్ముడులానే జీవిత భాగ‌స్వామి కూడా. దానిగురించి ప్ర‌తీసారీ మాట్లాడ్డం అనవసరం. అస్తమానూ ఇదే ప్ర‌శ్న‌ అడగొద్దు ప్లీజ్. ఆ టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా మాట్లాడతాను. మా రిలేషన్ షిప్ గురించి ఏదైనా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రతి ఇంటర్వ్యూలో నా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా… అంటూ సున్నితంగా తిర‌స్క‌రించింది..అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి రక‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఈ యేడాది చివ‌ర్లోనే వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకుంటార‌ని ఆ వార్త‌ల సారాంశం.

Poonam Pandey recalls how her family was thrown out!

rukshar dhillon hot stills in white dress!