దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో నటీమణులు సంజన గల్రానీ – రాగిణి ద్వివేది లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ కేసులో ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాగిణి – సంజనలు డ్రగ్స్ తీసుకున్నట్లు FSL రిపోర్టులో తేలింది. బెంగళూరు పోలీసులు 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుకలను FSLకు పంపగా..
ఈ హీరోయిన్లు డ్రగ్స్ సేవించినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది. దీంతో మరోసారి రాగిణి – సంజన లకు సమన్లు జారీ చేయనున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది – సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది.