
కొద్ది రోజుల క్రితం పూజ కార్యక్రమాలు ముగించారు మూవీ టీం. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్‌మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ల కాంబోలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. అయితే.. సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయో.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే..
ఈ క్రమంలోని సినిమాపై ఆడియోస్ లో మొదటి నుంచి మంచి హైప్ మొదలైంది. త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకీ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో మరింత హైప్ ఉంది. ఇలాంటి టైంలో సినిమా టైటిల్ పై రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వాటన్నింటిని బ్రేక్ చేస్తు మేకర్స్ సినిమా అఫీషియల్ టైటిల్ రిలీజ్ చేశారు. ఆదర్శ కుటుంబం టైటిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో వెంకటేష్ బ్యాగ్ పట్టుకొని నవ్వుతూ..ఆఫీస్ కి వెళ్తున్న ఫ్యామిలీ పర్సన్ గా కనిపించాడు..!!

