తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్య నటులు మరే ఇతర భాషలలో లేరు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఎందరో హాస్య నటులు హీరోలు అయ్యారు, నిర్మాతలు అయ్యారు, దర్శకులు అయ్యారు మరి ముఖ్యంగా ఎందరో రచయితలు హాస్య నటులుగా మారారు. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో హాస్య నటులది విడదీయరాని బంధం. అటువంటి హాస్య కులం నుంచి హీరో అయిన మొదటి తరం హాస్య నటుడు ఎవరో తెలుసా? నటుడిగానే కాదు దర్శకుడిగా కూడా ఆయన పరిణితి చెందారు అయన ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో మొదటి హాస్య నటుడు కస్తూరి శివ రావు అనుకుంటారు అందరు కానీ ఆయన కంటే ముందే వచ్చిన లంక సత్యం. తెలుగులో వచ్చిన తొలి హాస్య చిత్రం” బారిస్టర్ పార్వతీశం”, ఆ చిత్ర దర్శకుడు అయిన ఆర్.ఎస్. ప్రకాష్ వద్ద అసిస్టెంట్ గ పని చేస్తున్న లంక సత్యం లోని కామెడీ టైమింగ్ గమనించిన అయన, లంక సత్యం ను పార్వతీశం వేషం వేయమన్నారు, నాకు నటన రాదు మొర్రో అన్నా కూడా , వినకుండా ఆయన చేత తొలి తెలుగు వెండి తెర హాస్య కధా నాయకుడి పాత్ర వేయించారు ప్రకాష్ గారు.
ఆ చిత్రం లోని లంక సత్యం నటనకు అందరు ఆశ్ఛర్య పోయారు, మెచ్చుకున్నారు కానీ, ఆ తరువాత ఆయనకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఆ తరువాత కాలం లో జెమినీ సంస్థ నిర్మించిన “జీవన్ ముక్తి” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు లంక సత్యం. అక్కినేని నటించిన బాల నాగమ్మ చిత్రంలో హాస్య నటుడిగా చేసారు సత్యం, అందులో ఆయనకు మంచి పేరు వచ్చింది, కానీ అవకాశాలు లేవు. ఆ సమయంలోనే కస్తూరి శివ రావు రంగ ప్రవేశం తో హాస్య నటులు కూడా తారలే అనే స్థాయి వచ్చింది, కానీ లంక సత్యం నటన కంటే , దర్శకత్వం వైపు మొగ్గు చూపారు, అసిస్టెంట్ డైరెక్టర్ గ చాల చిత్రాలకు పని చేసారు, దర్శకుడు అయ్యారు. ఆ తరువాత యెన్.టి.ఆర్. దృష్టిలో పడటం తో ఆయన ఎన్నో హాస్య పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. లంక సత్యం ఏ ఫీల్డ్ లోను పూర్తి స్థాయి లో తన ప్రతిభ కనబర్చక, కలగా, పులగం గ తన కెరీర్ ని కన్ఫ్యూషన్ లో పెట్టేసారు, అందుకే ఆయన పూర్తి స్థాయి నటుడిగాను లేదా, దర్సకుడిగాను గుర్తింపు పొందలేకపోయారు. అందుకే ఆయనకు దక్కవలసిన గుర్తింపు దక్క లేదు, తానూ నడిచే మార్గాన్ని నిర్దేశించుకోక పోవటం తో ఆయన కెరీర్ ఉండవలసినంత ఉజ్వలంగా గడవలేదు, కానీ మంచి మనిషిగా గుర్తింపును పొందారు..!!