
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మె[/qodef_dropcaps] గా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గ ఫిదా మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లొ అడుగుపెట్టిన సాయి పల్లవి తన అందం నటనతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిందని చెప్పాలి. అయితే ఆ సినిమా తరువాత సాయి పల్లవి కి ఇంకొక మంచి హిట్ మాత్రం పడలేదు. రీసెంట్ గ శర్వానంద్ తో జత కలిసి చేసిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రం కూడా గోరంగా విఫలం అయ్యింది. దీనితో తన తదుపరి చిత్రం రానా తో వస్తున్న ‘విరాట పర్వం’ తో ఎలాగైనా మళ్ళి టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయ్యినట్లే తెలుస్తుంది. ఇంక అసలు విషయం లోకి వెళ్తే విరాట పర్వం లొ రానా పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తుండగా ఫిదా బ్యూటీ నక్సలైట్ పాత్రలో కనిపించనుంది. గ్లామర్ రోల్ అంటే ఎలాగోలా మానేజ్ చేయొచ్చు కానీ నక్సలైట్ పాత్రా అంటే కష్టం అని భావించిన సాయి పల్లవి అందుకోసం ఒక EX – నక్సలైట్ దగ్గర ట్రైనింగ్ తీస్కుంటున్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లొ చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది సాయి పల్లవి. మరి నక్సలైట్ రోల్ లొ మనల్ని మళ్ళి ఫిదా చేస్తుందో లేదో వేచి చూడాలి.